ఉపాధ్యాయులు, విద్యార్థులలో సాధించాల్సిన సామర్థ్యాలు, బోధనాంశాలు, బోధనాభ్యసన సామాగ్రి, బోధనా పద్దతులు మొదలైన అంశాలకు సంబంధించి ఒకే ప్రణాళికను తయారుచేసుకున్నట్లయితే బోధన సులభతరం అవుతుందని మనకు తెలుసుగదా! ఒకే క్రమపద్ధతి, ప్రణాళిక ప్రకారం ఒక సంవత్సరం కాలంలో బోధించాల్సిన విషయాలకు సంబంధించి లక్ష్యాలు, సమయం ముందుగా నిర్ణయించుకోవాలి. తరగతి బోధనను ఒక వ్యవస్థగా అనుకుంటే, ఆ వ్యవస్థలో అనేక ఉప వ్యవస్థలు ఉంటాయి. ఉప వ్యవస్థలు విశ్లేషిస్తే గానీ వ్యవస్థను మెరుగుపరచలేము. సూక్ష్మబోధన సాధారణ తరగతిలో ఉండే బోధనలోని సంక్లిష్టతలను తగ్గించటానికి కావలసిన శిక్షణా వాతావరణాన్ని అందిస్తుంది. సూక్ష్మబోధనా నైపుణ్యాల ద్వారా ఛాత్రోపాధ్యాయులు తరగతి గది లక్ష్యాలను చక్కగా సాధించవచ్చు. వివిధ నైపుణ్యాలతో పాటు వార్షిక పథకం, యూనిట్ పథకం మరియు పీరియడ్ పథకాల అవగాహన కూడా ఉపాధ్యాయులకు అత్యవసరం. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం ఆధారంగా తరగతి బోధన కూడా మార్పు చెందాల్సిన అవసరం ఉంది. సాంప్రదాయక పీరియడ్ పథకాలతో పాటుగా నూతనంగా నచ్చిన రాష్ట్ర విద్యా పరిశోధన
శిక్షణా సంస్థ వెలువరించిన నిరంతర సమగ్ర మూల్యాంకన ఆధారిత, పీరియడ్ పథకం యొక్క అవగాహన చాత్రోపాధ్యాయులకు తప్పనిసరిగా ఉండాలి.

కోర్సు ఉపోద్ఘాతం వీడియో