యూనిట్

నిర్ణయించబడిన బోధనా లక్ష్యాలను నెరవేర్చడానికి అభ్యసనకు తోడ్పడే కృత్యాలు ఏర్పాటు చేయడానికి అనువైన సమస్యా కేంద్రంగా ఉన్న లేదా భిన్న భావనలను కేంద్రీకరించే ఒకే సందేశమును విషయ భాగాన్ని యూనిట్ అంటారు.
" యూనిట్ ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర -హెర్బర్ట్,
"అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయభాగమే యూనిట్" - ప్రెస్
"బహు జాగ్రత్తగా ఎంపిక చేయబడి, విద్యార్థుల అవసరాలను మరియు అభిరుచులకు అనుగుణంగా సంబంధాలను ఏర్పరచడానికి వేరుపరచిన విషయ భాగం యొక్క బాహ్య రూపమే యూనిట్" -శ్యామ్ఫోర్డ్
"పాఠ్య ప్రణాళికతో దగ్గరి సంబంధం కలిగిన పాఠ్యాంశాలన్నింటిని కలిపి లక్ష్యంతో తయారు చేసేదే యూనిట్ - హాపర్

యూనిట్ లక్షణాలు

విద్యార్థి యొక్క అవసరాలు, అభిరుచులు, సామర్థ్యాల అనుగుణంగా యూనిట్ వుండాలి.
మంచి యూనిట్ ప్రత్యక్షమైన, వ్యక్తిపరమైన అనుభవాత్మక కృత్యాల ప్రాతిపదికగా ఉంటుంది.
నిర్దేశిత లక్ష్యాలను నెరవేర్చడానికి అనుకూలంగా ఉండాలి.
సాంఘిక, భౌతిక ప్రపంచాలతో సంబంధం కలిగినదై ఉండాలి.
అధిక సామర్థ్యం గల విద్యార్థులు ఆయూనిట్ పరిధిని దాటి వెళ్ళడానికి అవకాశం ఉండాలి.
యూనిట్లోని కృత్యాలశ్రేణి ఎక్కువగా ఉంటే విద్యార్థులందరికీ ఆసక్తి కలుగుతుంది. 
ఉపయోగించవలసిన బోధనోపకరణాలు, మూల్యాంకనం, చదవాల్సిన గ్రంథాలను సూచించాలి.
ప్రతి యూనిట్ను అర్థవంతమైన ఉపయూనిట్లగా విడగొట్టుకున్న తర్వాత ఒక్కొక్క ఉపయూనిట్ని పూర్తి చేయటానికి
పట్టే పీరియడ్ల సంఖ్యను నిర్ణయించుకోవాలి.

آخری ترمیم: منگل, 12 اگست 2025, 4:08 PM