పాఠ్యాంశం ద్వారా సాధించాల్సిన లక్ష్యాలను ముందుగా స్పష్టంగా ఏర్పరచవచ్చు.
నిర్ణయించుకున్న లక్ష్యాలను తక్కువ శ్రమతో సులభంగా పాఠ్యబోధన ద్వారా సాధించవచ్చు.

పాఠ్యాంశ విషయాలను తార్కికంగాను, క్రమబద్ధంగాను బోధించవచ్చు.
ఉపాధ్యాయుడు ఆత్మ స్థై'ర్యంతో, ఆసక్తిగా పాఠ్యాంశాన్ని బోధిస్తాడు.
అందుబాటులో ఉన్న వనరులు, పరికరాలతో బోధనను చక్కగా కొనసాగిస్తారు.

పాఠ్యాంశ బోధనకు పూర్వం, బోధించే సమయంలో, బోధన పూర్తయిన తర్వాత చేయవలసిన అంశాలను (నియోజనాలు, మూల్యాంకన ప్రశ్నలు, కృత్యాలు) క్రమబద్ధంగా తయారు చేసుకోవచ్చు.
సమయం వృథాకాకుండా బోధించవచ్చు.
ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధనకు మానసికంగా సిద్ధమవుతూ, సందర్భోచిత ఉదాహరణలు, దృష్టాంతాలు, కృత్యాలు ఎన్నుకొని ఉపయోగించగలడు.

పీరియడ్ పథకం సోపానాలు (హెర్బార్షియన్ సోపానాలు)

జె.ఎఫ్. హెర్బార్ట్ అనే విద్యావేత్త సూచించిన విధంగా పాఠ్యపుస్తకంలో ఆరు దశలుంటాయి.

  • సన్నాహం 
  • సమర్పణ
  • సంసర్గం
  • సాధారణీకరణం
  • అన్వయం
  • పునర్విమర్శ

1. సన్నాహం

ఈ దశలో ఉపాధ్యాయులు విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరిశీలించి, ఆ అనుభవాల సహాయంతో తర్వాత దశలో బోధించే పాఠ్యాంశాలను చక్కగా బోధిస్తారు. చర్చలు, కథలు, కృత్యాల ద్వారా పూర్వ జ్ఞానాన్ని రాబట్టవచ్చు. ఈ  దశలో విద్యార్థులలో ఒకే రకమైన ప్రేరణను కలిగించి సంసిద్ధతను ఏర్పరుస్తారు.

2. సమర్పణ
ఈ దశలో ఉపాధ్యాయులు బోధనకు అనువైన ప్రదర్శనలు, కృత్యాలు, బోధనోపకరణలు, అభ్యసనానుభవాలతో పాఠ్యాంశాన్ని బోధిస్తారు. బోధించాల్సిన అమూర్త భావనలను, మూర్త భావనలు ఆధారంగా ఆసక్తికరంగా సమగ్రంగా బోధించడం జరుగుతుంది. 

3. సంసర్గం
ఈ దశలో విద్యార్థికి ఉన్న పూర్వభావనలు, ప్రస్తుత పాఠ్యాంశాలకు సంబంధించిన నూతన భావనల సంసర్గం జరుగుతుంది. భావనల పోలికలు, వృత్యాసాలను గుర్తించి సమ్మేళనం చేయబడిన నూతన భావనలతో పాఠ్యాంశం పట్ల అభిరుచి పెంపొందించుకోవడానికి అవకాశం కల్పించే దశగా గుర్తించాలి.

4. సాధారణీకరణం
ఈ దశలో విద్యార్థులు పాఠ్యాంశంలోని నూతన భావనలను అవగాహన చేసుకొనే స్థాయిని అనుసరించి ఆవిషయం సాధారణీకరణం చేయడం అనే అత్యంత క్లిష్టమైన స్థాయికి చేరుకోవడం కోసం విద్యార్థులకు తగిన సహకారాన్ని ఉపాధ్యాయుడు అందించవలసి ఉంటుంది. విద్యార్థులను సరైన రీతిలో ప్రశ్నించడం, ఆలోచింపచేయడం ద్వారా, తగిన విధంగా విద్యార్థులను ద్వారా ఒక విషయం గురించిన నిర్వచనాలు, సూత్రాలు, ధర్మాలు మొదలైనవి విద్యార్థి స్వయంగా అవగాహన చేసుకోవటానికి సహకరిస్తాడు.

5. అన్వయం
సాధారణీకరణ చేసి స్థాపించే అంశాలను తగిన సమయంలో వివిధ సందర్భాలలో అవ్వయించే శక్తి సామర్థ్యం. వైఖరులను పెంపొందించడం కోసం ప్రయత్నం జరుగుతుంది.

6. పునర్విమర్శ
ఈ దశలో ఉపాధ్యాయుడు తాను బోధించిన పాఠ్యాంశాలపై విద్యార్థులు ఆర్జించిన జ్ఞానం మొదలైన లక్ష్యాలను
పరీక్షిస్తాడు. అంటే ఈ దశను లక్ష్యసాధన జరిగిందా లేదా అని పరీక్షించే దశగా గుర్తిస్తారు.

నమూనా పాఠ్య పథకం 
(1) ప్రాథమికాంశాలు

1. ఉపాధ్యాయుని పేరు
2. తరగతి :                                                      5.  శీర్షిక :
3. యూనిట్                                                     6. తేది        
4. సబ్ యూనిట్                                            7. పీరియడ్  

 
II. విషయ విశ్లేషణ
1. పూర్వ జ్ఞానం
2. బోధనాభ్యసన అంశాలు
3. బోధనా లక్ష్యాలు / స్పష్టీకరణలు
4. బోధనోపకరణాలు
5. సంప్రదించవలసిన గ్రంథాలు

period plan


నమూనా పీరియడ్ పథకం

 పీరియడ్ పథకం (BRAOU Methods of Teaching Mathematics Course material)

మరింత సమాచారం కొరకు

Reference:

1 B.Ed. Maths Resource Book.pmd (scert.telangana.gov.in)



Last modified: Sunday, 3 August 2025, 4:02 PM