2. వార్షిక పథకం నమూనా

వార్షిక పథకం నమూనా

(రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 2014-15 సంవత్సరంలో వార్షిక ప్రణాళికను, సోపానాలను ఈ క్రింది విధమైన నమూనాలో సూచించారు

1. తరగతి
2. విషయం
3. అవసరమైన పీరియడ్ల సంఖ్య: బోధనాభ్యసనకు అవసరమైన పీరియడ్లు + అభ్యాసానికి అవసరమైన పీరియడ్లు+ ప్రాజెక్టుల ప్రదర్శనకు అవసరమైన పీరియడ్లు.
4. విద్యా సంవత్సరం పూర్తయ్యే సరికి పిల్లలు సాధించవలసిన సామర్థ్యాలు :
(సమస్యా సాధన, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, వ్యక్తపరచడం, అనుసంధానం చేయడం, దృశ్యీకరణ, ప్రాతినిధ్య పరచడం). గణిత సామర్థ్యాల వారిగా పిల్లలు ఏయేమి సాధించవలెనో పాఠ్యపుస్తకం చదివి నిర్ణయించి రాసుకోవాలి.
5. నెలవారి విభజన ప్రణాళిక

monthly planner

6. వార్షిక ప్రణాళిక అమలుపై ఉపాధ్యాయుని ప్రతిస్పంధనలు : (మాసవారిగా ఉపాధ్యాయులు రూపొందించుకున్న ప్రణాళిక అమలు తీరుపై, ఫలితాలపై తమ ప్రతిస్పందనలను రాసుకోవాలి).
7. వార్షిక ప్రణాళిక అమలుపై ప్రధానోపాధ్యాయుని సలహాలు, ప్రతిస్పందనలు.
గమనిక : ఈ వార్షిక ప్రణాళికలను ప్రతి ఉపాధ్యాయుడు వేసవి సెలవులలో తయారు చేసుకొని పాఠశాల ప్రారంభించిన రోజు ప్రధానోపాధ్యాయునికి సమర్పించాలి. ప్రధానోపాధ్యాయుడు ఆ ప్రణాళికలను చూసి తగు సూచనలు ఇవ్వాలి. ప్రతి సబ్జెక్టుకు, ఒక తరగతికి 200 పేజీల నోటు పుస్తకం పెట్టి దానిలో మొదట వార్షిక ప్రణాలికలను రాసి తర్వాత పాఠ్య  ప్రణాళికలు రాయాలి. ఒక ఉపాధ్యాయుడు 4 తరగతులుకు, 4 సెబ్జక్టులను బోధిస్తే 4 నోట్ బుక్కులు పెట్టుకోవాలి.