వార్షిక పథకం తయారుచేసేటపుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు
ఆ విద్యా సంవత్సరంలో సాధించాల్సిన సబ్జెక్టు వారీ లక్ష్యాలు.
పాఠ్య పుస్తకానికి సంబంధించిన తాత్విక నేపధ్యం.
విద్యా సంవత్సరంలో అందుబాటులో ఉండే పీరియడ్ల సంఖ్య
పాఠశాల పనిదినాల సంఖ్య
సాధించాల్సిన విద్యా ప్రమాణాలు .
పాఠ్యపుస్తకేతర అనుబంధ కృత్యాలు
ఒక్కో యూనిట్‌ని బోధిండానికి పట్టే కాలం.
భావనల అవగాహనకు అందుబాటులో ఉన్న బోధనా సామాగ్రి,
నిర్మాణాత్మక, సంగ్రహాణాత్మక మూల్యాంకనం జరిగే సమయం.
ఉపాధ్యాయుడు తీసుకొనే సెలవు దినాల సంఖ్య.
ప్రత్యేక సెలవు రోజులు.
వివిధ పరీక్షలు నిర్వహించడానికి అడ్మిషన్ సమయానికి పట్టే రోజులు కూడా గుర్తుంచుకోవాలి.
1. వార్షిక పథకం ప్రయోజనాలు
ఉపాధ్యాయులు సిలబస్ ను క్రమబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలరు.
ఏ యూనిట్ ఏనెలలో ఎంత మేరకు బోధించాలలో తెలుసుకుంటారు.
ఆ యూనిట్ ద్వారా తాను సాధించవలసిన లక్ష్యాలను తెలుసుకుంటారు.
యూనిట్ ప్రాముఖ్యత కఠినతలను దృష్టిలో ఉంచుకుని సమయం కేటాయించడం వలన అన్ని స్థాయి విద్యార్థులకు మేలు జరుగుతుంది.
యూనిట్ పథకాన్ని సులభతరం చేసుకోవడానికి దోహదపడుతుంది.
విషయ వ్యవస్థాపనలో అంతర దృష్టి పెరుగుతుంది. ఉపాధ్యాయులు విషయ ఆధారిత సమన్వయంతో అర్థవంతంగా బోధించగలుగుతారు.
పునర్విమర్శకు కూడా అవకాశం ఉంటుంది.