సూక్ష్మబోధన - ప్రాముఖ్యత - లక్షణాలు
| Site: | Dr. B.R. Ambedkar Open University Online Learning Portal |
| Course: | గణితశాస్త్ర బోధనకు ప్రణాళిక రచన |
| Book: | సూక్ష్మబోధన - ప్రాముఖ్యత - లక్షణాలు |
| Printed by: | Guest user |
| Date: | Wednesday, 15 April 2026, 1:46 AM |
1. సూక్ష్మబోధన - అర్థం
సూక్ష్మబోధన - భావన, అర్థం
"నియంత్రిత పరిస్థితులలో ఒక బోధనా ప్రవర్తన మీద కేంద్రీకరించటానికి నియంత్రించబడే బోధనా విధానమే సూక్ష్మబోధన " ఎలెన్. ఈవ్.
"సూక్ష్మబోధన ఒక ఉపాధ్యాయ శిక్షణా ప్రక్రియ. ఇది బోధనాభ్యాసాన్ని ఒక నైపుణ్యానికి పరిమితం చేసి, తరగతి కాలాన్ని తరగతి పరిమాణానికి తగ్గించటం ద్వారా బోధనా పరిస్థితిని సరళమైన ఎక్కువ నియంత్రణ చేయబడిన వ్యూహంగా తగ్గిస్తుంది"
"స్పష్టంగా నిర్వచింపబడిన బోధనా నైపుణ్యాలను, జాగ్రత్తగా తయారు చేయబడిన పాఠ్యాంశాలకు అన్వయించి, చిన్న సమూహ విద్యార్థులకు నాలుగైదు నిముషాలలో బోధించి దాని ఫలితాలను వీడియోటేపు ద్వారా చూసుకోవడానికి అవకాశమున్న సాంకేతిక పరంగా నిర్వహించే ప్రక్రియ సూక్ష్మబోధన” - రాబర్ట్ బుష్
"సూక్ష్మబోధన అనేది ఒక శిక్షణా సాంకేతిక విధానం. ఇందులో స్వల్పకాల వ్యవధిలో, స్వల్ప సంఖ్యలో గల విద్యార్థులకు నిర్దుష్టమైన బోధనా నైపుణ్యాన్ని ఉపయోగించి ఒకే ఒక భావనను ఉపాధ్యాయ విద్యార్థి బోధిస్తాడు" - బి.కె. పాసి, యం.ఎస్. లలిత
2. సూక్ష్మబోధన - ప్రాముఖ్యత - లక్షణాలు
సూక్ష్మబోధన - ప్రాముఖ్యత - లక్షణాలు
- ఛాత్రోపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరచి తరగతి గది బోధనను పటిష్ట పరచడం.
- ఉపాధ్యాయ విద్యార్థుల లోపాలను గుర్తించి, వారు చక్కటి బోధనా నైపుణ్యాలను అభ్యసించుటలో ఉపకరించడం.
- ప్రయోగాత్మక ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలను అభివృద్ధి పరచడం.
- ఉపాధ్యాయుల ప్రవర్తనల మార్పుకు సహాయపడటం.
- సరికొత్త బోధనా నైపుణ్యాలను అన్వేషించడంలో తగిన పరిశోధనలను ప్రోత్సహించడం.
- సాధారణ బోధనలో గల క్లిష్టతను గుర్తించి, మెరుగుపరచి తక్కువ సమయంలో తగిన బోధనా శిక్షణను కల్పించడం.
- ఆశించిన ప్రవర్తన మార్పు వచ్చునంతవరకు, వారికి శిక్షణ ఇచ్చి పరిపుష్టినిచ్చి పునఃబోధన గావించి బోధనా నైపుణ్యంలో ప్రావీణ్యతను సంపాదించేటట్లు చేయడం.
సూక్ష్మబోధన - లక్షణాలు
సూక్ష్మబోధన ఉపాధ్యాయ విద్యా క్షేత్రంలో ఒక నూతన ప్రయోగం. ఉపాధ్యాయ విద్యార్థులకు బోధన కళను నేర్చుకోవడానికి తయారుచేయబడిన నూతన సాంకేతిక విధానమని మనకు ఇది వరకే తెలియును కదా! ఇప్పుడు సూక్ష్మబోధన లక్షణాలను చూద్దాం. దీనిలో తరగతి పరిమాణాన్ని 5-10 మంది విద్యార్థులకు కుదించడం.
బోధనా కాలాన్ని 4-10 నిమిషాలకు కుదించటం.
బోధనా విషయానికి ఒకే ఒక భావనకు కుదించడం.
ఒక సందర్భంలో ఒకే ఒక నైపుణ్యానికి పరిమితం చేసి అభ్యసించడం.
నైపుణ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం.
నైపుణ్యాన్ని ప్రదర్శించడం తర్వాత తన నిష్పాదన గురించి అభ్యాసకునికి తగినంత పరిపుష్టిని అందించే అవకాశం ఉంది. నిజ బోధనలోని సంక్లిష్టతలైన తరగతి పరిమాణం, బోధనాకాలం, బోధనా విషయం, ఏక కాలంలో అనేక నైపుణ్యాలను ప్రదర్శించడం అనేవి చెప్పుకోదగిన సూక్ష్మస్థాయి తగ్గించబడ్డాయి.
1. సూక్ష్మ మూలకం:
సూక్ష్మ-బోధన విద్యార్థుల పరంగా బోధనా పరిస్థితిని సంక్లిష్టతలకు తగ్గిస్తుంది, పాఠం యొక్క వ్యవధి మరియు బోధించవలసిన విషయం, తద్వారా శిక్షణ పొందిన వ్యక్తి శిక్షణ ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించడానికి వీలు కల్పిస్తుంది.
ఒక్కోసారి ఒకే నైపుణ్యంతో కూడిన నైపుణ్యంలో కూడా శిక్షణ ఇస్తారు. స్థూల స్థాయిలో బోధించే సంక్లిష్టమైన పనిని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రయత్నించే ముందు బోధనా పనిలోని భాగాలపై పట్టు సాధించాలి.
2. బోధనా నైపుణ్యాలు మరియు బోధనా వ్యూహాలు :
వివిధ పరిశోధకులు అనేక రకాల నైపుణ్యాలను జాబితా చేశారు, ఇవి వివిధ స్థాయిలలో అనేక విషయాలను బోధించడంలో పాల్గొనే విధులు, విధానాలు మరియు వ్యూహాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. బోధించే పని కింద బోధించబడిన నైపుణ్యాల కలయికలను మూడు విధాలుగా వర్గీకరించవచ్చు.
(i) ముందస్తు బోధనా నైపుణ్యం:
నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి, సరైన విషయం, సరైన సంస్థ, సరైన దృశ్య శ్రవణ పరికరాల ఎంపిక మొదలైన వాటిని సాధించడానికి సూచనల లక్ష్యాలను వ్రాయడం, క్రమబద్ధీకరించడం మరియు నిర్వహించే జ్ఞానాన్ని కలిగి ఉంటుంది.
(ii) బోధనా నైపుణ్యాలు:
పాఠాన్ని పరిచయం చేసే నైపుణ్యాలు, మరియు వివరించే నైపుణ్యాలు బలోపేతం చేయడం, ప్రశ్నలను పరిశీలించడం, విద్యార్థుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, విద్యార్థి కష్టాలను గుర్తించడం మొదలైనవి.
(iii) బోధనానంతర నైపుణ్యాలు:
పరీక్ష అంశాలను రాయడం, విద్యార్థులను వివరించడం, పరీక్షలో పనితీరు, నివారణ చర్యలను పథక రచన చేయడం మొదలైన నైపుణ్యాలు వంటివి.
3. అభిప్రాయ అంశం:
ఛాత్రోపాధ్యాయుల బోధనా సామర్థ్యాన్ని అంచనా వేసే ప్రస్తుత విధానంలో, సూపర్‌వైజర్ ద్వారా పరిపుష్ఠి ఇవ్వబడుతుంది. సూక్ష్మ-బోధనలో అవసరమైన అభిప్రాయాన్ని అందించడానికి అనేక విశ్వసనీయ మరియు ప్రామాణికమైన మూలాలను ఉపయోగించవచ్చు.
(ఎ) పర్యవేక్షిస్తున్న ఉపాధ్యాయుల మౌఖిక అభిప్రాయం.
(బి) సూక్ష్మ-బోధనలో పాల్గొనే సహచరుల బృందం ద్వారా పూరించిన పరిశీలన మాపనిలు.
(సి) ఆడియో-టేప్ రికార్డింగ్ అనేది ఖచ్చితమైన అభిప్రాయానికి మూలం.
(d) వీడియో-టేప్ రికార్డింగ్ అభిప్రాయానికి అత్యంత ఖచ్చితమైన మరియు శక్తివంతమైన మూలాన్ని అందిస్తుంది.
4. సురక్షిత సాధన ప్రదేశం:
ఒక సూక్ష్మ-బోధన ప్రయోగశాల, తరగతి గది యొక్క అన్ని స్వాభావిక లక్షణాలను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది.
5. బోధనా నమూనాలు:
శిక్షణ పొందిన వారికి టేపులు, బోధనా నమూనాల ఫిల్ములు లేదా పర్యవేక్షకుడు ఇచ్చిన ప్రదర్శనల ద్వారా కావలసిన ప్రవర్తన నమూనాలను అధ్యయనం చేయడానికి అనేక అవకాశాలు ఉంటాయి. ఈ నమూనాలను మార్గదర్శకంగా ఉపయోగించడం ద్వారా శిక్షణార్థులు తమ స్వంత బోధనా శైలిని అభివృద్ధి చేసుకుంటారు.
- సూక్ష్మబోధన - ప్రాముఖ్యత - లక్షణాల గురించి మరింత సమాచారం కోసం క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
సూక్ష్మబోధన - ప్రాముఖ్యత - లక్షణాలు
సూక్ష్మబోధన భావన గురించి మరింత సమాచారం కొరకు క్రింది వీడియోని చూడండి
Attribution: "Micro Teaching concept" by Teacher Plus is licensed under CC BY-SA 3.0
3. సూక్ష్మబోధన – చక్రం
సూక్ష్మ-బోధన విధానంలో శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయుడు, ఒకే పాఠ్యాంశాన్ని ఆధారంగా తీసుకుని ఒక నిర్దిష్ట బోధనా నైపుణ్యాన్ని అభ్యాసించగలుగుతాడు. బోధన సమయంలో తన ప్రవర్తనను వీడియో టేపు, ఆడియో టేపు రికార్డర్ లేదా పరిశీలకుని ఆధారంగా రికార్డు చేయగలిగే అవకాశం కలదు. తర్వాత, ఆ రికార్డులను విశ్లేషించడం ద్వారా తన బోధనా నైపుణ్యాన్ని, ప్రవర్తనను క్రమబద్ధీకరించుకోవచ్చు. ఈ ప్రక్రియను క్రమబద్ధమైన పునఃశ్చరణ అంటారు. ఈ విధానంలో విశ్లేషించిన ఫలితాల ఆధారంగా ఉపాధ్యాయుడు తిరిగి బోధించేందుకు అవకాశమిస్తారు. ఈ దశలన్నీ సూక్ష్మ-బోధనా చక్రం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఉపాధ్యాయ విద్యార్థి కావలసిన నైపుణ్యంపై ప్రావీణ్యతను సాధించే వరకు ఈ సూక్ష్మ-బోధనా చక్రం పునరావృతం అవుతూనే ఉంటుంది.
సూక్ష్మ బోధనా చక్రంలోని అంశాలు
సూక్ష్మ-బోధన చక్రంలోని అంశాలు
1. సూక్ష్మ బోధన పాఠ్యాంశ పథక నిర్మాణం
ఉపాధ్యాయ విద్యార్థి తాను ఎంపిక చేసుకున్న బోధనా నైపుణ్యం అభ్యాసం చేయటానికి ఒక భావనను ఎంపిక చేసుకుంటాడు. బోధనా నైపుణ్యానికి ప్రవర్తనలుగా విశ్లేషించి తగిన విధంగా సూక్ష్మబోధన పాఠ్య పథకాన్ని 5 -10 నిమిషాలలో పూర్తయ్యే విధంగా తయారు చేస్తాడు.
2. బోధన
సూక్ష్మ-బోధనకు కావాల్సిన అనుకూల వాతావరణం అనగా సామాగ్రి, బల్లలు, గాలి, వెలుతురు మొదలగు ఏర్పాట్లు చేసుకొంటారు. ఎంపిక చేసుకొన్న నైపుణ్యాన్ని 5-10 నిమిషాల వ్యవధిలో ఒక చిన్న సమూహా(5-10 విద్యార్థులు) నికి బోధిస్తారు. ఈ ప్రదర్శనను వీడియో ద్వారా గాని, సహవిద్యార్థుల అధ్యాపకుల పరిశీలన ద్వారా చర్చిస్తారు.
3. పరిపుష్టిని ఇవ్వటం
అందించిన పరిశీలనల ఆధారంగా ఉపాధ్యాయ విద్యార్థికి అతనిలో లోపాలను తెలిపి చర్చించి అవి సరిదిద్దుకోనుటకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఆడియో, వీడియో టేపులు, నిర్ధారణ మాపనాల ద్వారా ఉపాధ్యాయ విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచే అవకాశం ఉంటుంది.
4. పునః పథక రచన
ఇవ్వబడిన సూచనలను అనుగుణంగా ఉపాధ్యాయ విద్యార్థి పాఠ్యాంశ పథకాన్ని తిరిగి తయారు చేస్తాడు.
5. పునః బోధన
చాత్రొపాద్యయునిచే తిరిగి రాయబడిన పాఠ్య పథకం ప్రకారం బోధన గావించబడుతుంది. నైపుణ్యాన్ని సాధించే ప్రయత్నంలో తిరిగి నూతన పథకం ద్వారా బోధిస్తాడు.
6. పునః పరిపుష్టి
మరలా ఉపాధ్యాయ విద్యార్థి యొక్క బోధన అనుసరించి ఛాత్రోపాధ్యాయులు, అధ్యాపకులు సూచనలిస్తారు. ఒకవేళ ఛాత్రోపాద్యాయుల నైపుణ్యంలో ప్రావీణ్యత పొందినట్లయితే ఆ నైపుణ్యాన్ని తిరిగి అభ్యసించారు. ప్రావీణ్యత పొందనట్లయితే మరలా ఈ సూక్ష్మబోధనా చక్రం ద్వారా తిరిగి సాధన చేయాలి. ఈ విధంగా సూక్ష్మబోధన ఒక సోపానం తర్వాత మరియొక్క సోపాన చట్రంలో తిరుగుతూ సంపూర్ణ నైపుణ్యం సంతృప్తికరంగా నేర్చుకొనేంతవరకు కొనసాగించబడుతుంది.

మరింత సమాచారం కొరకు క్రింది వీడియోను చూడండి
(Reference(Micro Teaching by Dr.Padala Laxman is licensed under CC By-SA 3.0)
4. సూక్ష్మ బోధన నైపుణ్యాలు
బోధనా నైపుణ్యాలను అభివృద్ధి పరచుకొనుటకు చేసే ప్రయత్నమే సూక్ష్మ బోధన అని మనకు తెలుసు గదా! అనేకమంది విద్యావేత్తలు బోధనా వ్యవస్థను విశ్లేషించి బోధనా నైపుణ్యాలను ప్రతిపాదించారు. భారతీయ విద్యావేత్త బి.కె.పాసి బోధనా నైపుణ్యాలను 1975 సంవత్సరంలో విశ్లేషించి 13 ముఖ్య నైపుణ్యాలను ప్రతిపాదించారు. ఈ నైపుణ్యాలను మనదేశంలో ఉపాధ్యాయ విద్యా సంస్థలలో ఎక్కువగా వినియోగిస్తున్నారు.
ఉపాధ్యాయ విద్యలో ప్రస్తుతం విరివిగా ఉపయోగిస్తున్న కొన్ని మాదిరి నైపుణ్యాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రతి నైపుణ్యంలో కచ్చితంగా ఉపాధ్యాయ విద్యార్థి సాధన చేయవలసిన ముఖ్యమైన వాంఛనీయ ప్రవర్తనలు ఉంటాయి. వాటి ఆధారంగా ఛాత్రోపాధ్యాయులు నైపుణ్యాలు సాధించాలి.
1. బోధనా లక్ష్యాలు, సృష్టీకరణాలు రాయడం.
2.పాఠ్యాంశాన్ని ప్రవేశ పెట్టడం.
3.ధారాళంగా ప్రశ్నిచండం.
4.అన్వేషణాధార ప్రశ్నలు వేయడం
5.వివరించడం
6.ఉదాహరణలు ఇవ్వడం
7.ఉద్దీపన వైవిధ్యం
8.నిశ్శబ్ద మరియు శాబ్దికేతర సంకేతాలు
9.పునర్భలనం
10.విద్యార్థుల భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడం.
11.నల్లబల్ల వినియోగం
12.పాఠ్యాంశం ముగింపు
13.విద్యార్థుల సంసిద్ధత ప్రవర్తన
1. ఉద్దీపన మార్పు నైపుణ్యం (Skill of Stimulus variation)
ముఖ్యమైన అంశాలు లేదా వాంఛనీయమైన ప్రవర్తనలు
· ఉద్దేశ్య పూర్వకమైన కదలికలు
· కవళికలు లేదా చేతలు
· స్వరాన్ని మార్చటం
· దృష్టిని కేంద్రీకరించుట
· మాట్లాడే శైలిలో మార్పులు తీసుకుని రావడం
· మధ్య మధ్యలో ఆపటం
· జ్ఞానేంద్రియాల వినియోగాన్ని మార్చటం
2. పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టడం (Skill of Introducing a lesson)
ముఖ్యమైన అంశాల లేదా వాంఛనీయమైన ప్రవర్తనలు
· పూర్వజ్ఞానాన్ని పరిక్షించడం / విద్యార్థి అనుభవాన్ని తెలిసికోవడం
· క్రమ పద్ధతిలో ప్రశ్నించటం
· బోధనోపకరణాలను, పద్ధతులను సరైన రీతిలో ఉపయోగించడం.
· ఉన్ముఖీకరణ, రాబట్టుట
· విద్యార్థుల సహాయంలో శీర్షికను ప్రవేశపెట్టడం.
3. వివరించే నైపుణ్యం (Skill of Explanation)
ముఖ్యమైన అంశాలు లేదా వాంఛనీయమైన ప్రవర్తనలు
· విద్యార్థుల అవగాహనను పరీక్షించడం.
· ముగింపు వాక్యాలను ఇవ్వడం.
ఉదాహరణలతో వివరించే నైపుణ్యం (Skill of Illustrating with examples
· ముఖ్యమైన అంశాలు లేదా వాంఛనీయమైన ప్రవర్తనలు
· సరళమైన ఉదాహరణలు రూపొందించడం
· తగిన ఉదాహరణలు రూపొందించడం
· సరైన ప్రారంభ వాక్యాలు వాడటం.
· వివరణలను అంశాలను పూర్తి చేయడం
· ముఖ్యమైన అంశాలను పూర్తిచేయడం
· ధారాళంగా వివరించడం.
4. నల్ల బల్ల ఉపయోగించే నైపుణ్యం (Skill of using Black Board)
- అందమైన, తప్పులు లేని రాతని క్రమబద్ధంగా రాయడం.
- రాసేటప్పుడు చేతిని నిటారుగా ఉంచడం.
- విద్యార్థుల వైపు చూస్తూ రాయడం.
- నల్ల బల్లను పైనుంచి కిందకు తుడవడం
- పరిశుభ్రతను పాటించడం
- నల్ల బల్లకు 45 ° కోణంలో నిలబడి రాయడం.
5. సూక్ష్మబోధనా పథక నిర్మాణం / రచన
సూక్ష్మ బోధన ద్వారా నైపుణ్యాలను సాధన చేయాలంటే 5-10 నిమిషాల కాల వ్యవధిలో ఏ విషయం తీసుకోవాలి? ఉపాధ్యాయుడు అవలంబించవలసిన కృత్యాలేవి? విద్యార్థి కృత్యాలేవి? నల్లబల్ల లేదా బోధనోపకరణాలు ఎలాంటివి సమకూర్చుకోవాలి. లాంటి ప్రశ్నలు సాధారణంగా కలుగుతాయి. వీటికి సమాధానమే పాఠ్య పథక నిర్మాణం. ఇపుడు సూక్ష్మ బోధన పాఠ్య పథక నమూనాను పరిశీలిద్దాం.
పాఠ్య పథక నమూనా
ఉపాధ్యాయ విద్యార్థి పేరు: తేది: క్రమసంఖ్య: ఉపశీర్షిక / బోధనాంశం :
శీర్షిక: నైపుణ్యం :
సమయం /సెషన్ :
