సూక్ష్మబోధన - ప్రాముఖ్యత - లక్షణాలు

3. సూక్ష్మబోధన – చక్రం

సూక్ష్మ-బోధన విధానంలో శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయుడు, ఒకే పాఠ్యాంశాన్ని ఆధారంగా తీసుకుని ఒక నిర్దిష్ట బోధనా నైపుణ్యాన్ని అభ్యాసించగలుగుతాడు. బోధన సమయంలో తన ప్రవర్తనను వీడియో టేపు, ఆడియో టేపు రికార్డర్ లేదా పరిశీలకుని ఆధారంగా రికార్డు చేయగలిగే అవకాశం కలదు. తర్వాత, ఆ రికార్డులను విశ్లేషించడం ద్వారా తన బోధనా నైపుణ్యాన్ని, ప్రవర్తనను క్రమబద్ధీకరించుకోవచ్చు. ఈ ప్రక్రియను క్రమబద్ధమైన పునఃశ్చరణ అంటారు. ఈ విధానంలో విశ్లేషించిన ఫలితాల ఆధారంగా ఉపాధ్యాయుడు తిరిగి బోధించేందుకు అవకాశమిస్తారు. ఈ దశలన్నీ సూక్ష్మ-బోధనా చక్రం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఉపాధ్యాయ విద్యార్థి కావలసిన నైపుణ్యంపై ప్రావీణ్యతను సాధించే వరకు ఈ సూక్ష్మ-బోధనా చక్రం పునరావృతం అవుతూనే ఉంటుంది.

సూక్ష్మ బోధనా చక్రంలోని అంశాలు

సూక్ష్మ-బోధన చక్రంలోని అంశాలు
1. సూక్ష్మ బోధన పాఠ్యాంశ పథక నిర్మాణం
ఉపాధ్యాయ విద్యార్థి తాను ఎంపిక చేసుకున్న బోధనా నైపుణ్యం అభ్యాసం చేయటానికి ఒక భావనను ఎంపిక చేసుకుంటాడు. బోధనా నైపుణ్యానికి ప్రవర్తనలుగా విశ్లేషించి తగిన విధంగా సూక్ష్మబోధన పాఠ్య పథకాన్ని 5 -10 నిమిషాలలో పూర్తయ్యే విధంగా తయారు చేస్తాడు.
2. బోధన
సూక్ష్మ-బోధనకు కావాల్సిన అనుకూల వాతావరణం అనగా సామాగ్రి, బల్లలు, గాలి, వెలుతురు మొదలగు ఏర్పాట్లు చేసుకొంటారు. ఎంపిక చేసుకొన్న నైపుణ్యాన్ని 5-10 నిమిషాల వ్యవధిలో ఒక చిన్న సమూహా(5-10 విద్యార్థులు) నికి బోధిస్తారు. ప్రదర్శనను వీడియో ద్వారా గాని, సహవిద్యార్థుల అధ్యాపకుల పరిశీలన ద్వారా చర్చిస్తారు.
3. పరిపుష్టిని ఇవ్వటం
అందించిన పరిశీలనల ఆధారంగా ఉపాధ్యాయ విద్యార్థికి అతనిలో లోపాలను తెలిపి చర్చించి అవి సరిదిద్దుకోనుటకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఆడియో, వీడియో టేపులు, నిర్ధారణ మాపనాల ద్వారా ఉపాధ్యాయ విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచే అవకాశం ఉంటుంది.
4. పునః పథక రచన
ఇవ్వబడిన సూచనలను అనుగుణంగా ఉపాధ్యాయ విద్యార్థి పాఠ్యాంశ పథకాన్ని తిరిగి తయారు చేస్తాడు.
5. పునః బోధన
చాత్రొపాద్యయునిచే తిరిగి రాయబడిన పాఠ్య పథకం ప్రకారం బోధన గావించబడుతుంది. నైపుణ్యాన్ని సాధించే ప్రయత్నంలో తిరిగి నూతన పథకం ద్వారా బోధిస్తాడు.
6. పునః పరిపుష్టి
మరలా ఉపాధ్యాయ విద్యార్థి యొక్క బోధన అనుసరించి ఛాత్రోపాధ్యాయులు, అధ్యాపకులు సూచనలిస్తారు. ఒకవేళ ఛాత్రోపాద్యాయుల నైపుణ్యంలో ప్రావీణ్యత పొందినట్లయితే నైపుణ్యాన్ని తిరిగి అభ్యసించారు. ప్రావీణ్యత పొందనట్లయితే మరలా సూక్ష్మబోధనా చక్రం ద్వారా తిరిగి సాధన చేయాలి. విధంగా సూక్ష్మబోధన ఒక సోపానం తర్వాత మరియొక్క సోపాన చట్రంలో తిరుగుతూ సంపూర్ణ నైపుణ్యం సంతృప్తికరంగా  నేర్చుకొనేంతవరకు కొనసాగించబడుతుంది.

సూక్ష్మ బోధన చట్రం

మరింత సమాచారం కొరకు క్రింది వీడియోను చూడండి
     
                                         


(Reference(Micro Teaching by Dr.Padala Laxman is licensed under CC By-SA 3.0)